అమెరికాలో తన సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించిన కేఏ పాల్

  • ఇటీవల పవన్ ప్రసంగంపై కేఏ పాల్ విమర్శలు
  • ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమేనా అని ప్రశ్న
  • ఈ గొడవలు ఎందుకంటూ ప్రశ్న

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల తెలంగాణలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "పవన్ కల్యాణ్ ఇలా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమేనా?" అని పాల్ ప్రశ్నించారు. 


ప్రజలు తమకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమని నిలదీస్తుంటే.. వాటిని పక్కనపెట్టి, ఈ గొడవలు ఎందుకంటూ మండిపడ్డారు. అలాగే జూన్ 14న అమెరికాలోని హ్యూస్టన్‌లో తాను నిర్వహించబోయే భారీ సభకు రావాలంటూ పవన్‌ను ఆహ్వానించారు.


ఇటీవలి ప్రెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన తెలంగాణలోనూ పోటీ చేస్తుందని, త్వరలోనే తాను ఇక్కడ పర్యటిస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే "నన్ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వం అనడానికి తెలంగాణ ఏమైనా మీ జాగీరా?" అని ఆయన ప్రశ్నించడం వివాదానికి దారితీయడం తెలిసిందే.


KA Paul
Pawan Kalyan
Jana Sena Party
Praja Shanti Party
Houston Meeting
Telangana Politics
BJP Jana Sena Alliance
GHMC Elections
USA Public Meeting

More Telugu News